కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం "డ్రైవర్ జమున". P కింస్లిన్ డైరెక్షన్లో సర్వైవల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను 18 రీల్స్ బ్యానర్ పై SP చౌదరి నిర్మించారు. పలు కారణాల వల్ల వాయిదా పడి ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాలో ఐశ్వర్య ఒక క్యాబ్ డ్రైవర్ పాత్రలో నటిస్తుంది. ఈ నేపథ్యంలో ఫిమేల్ క్యాబ్ డ్రైవర్లకు డ్రైవర్ జమున మేకర్స్ ఒక స్పెషల్ ప్రీమియర్స్ ని ఏర్పాటు చేసారు. కుటుంబం నడపడం కోసం, ఇంకా ఎన్నో కారణాలతో క్యాబ్ డ్రైవర్లుగా పని చేస్తున్న ఆడవాళ్లందరికీ తమ సినిమాను అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa