ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజన కలెక్షన్లు వసూలు చేస్తున్న చిత్రం "దృశ్యం 2". విడుదలై ఆరువారాల గడుస్తున్నా ధియేటర్లలో రష్ ఇంకా తగ్గలేదనే చెప్పాలి.
అభిషేక్ పాఠక్ డైరెక్షన్లో ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో అజయ్ దేవగణ్, శ్రేయా శరణ్, టబు, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. నవంబర్ 18న బాలీవుడ్ లో విడుదలైన దృశ్యం 2 మూవీ సరిగ్గా వారం తిరిగేసరికల్లా వంద కోట్ల గ్రాస్ మార్క్ ను రీచ్ అయ్యి, రీసెంట్గానే 200కోట్ల క్లబ్ లోకి చేరింది.
విశేషమేంటంటే, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా దృశ్యం 2 డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసింది. ప్రస్తుతం దృశ్యం 2 మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఐతే, ప్రైమ్ వీడియోలో ఎవ్వరు ఈ సినిమా చూడాలని అనుకున్నా.. రూ. 199 పే చెయ్యాల్సిందే. ఆఖరికి ప్రైమ్ యూజర్లు కూడా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa