ప్రపంచమంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూసిన "అవతార్" సీక్వెల్ "అవతార్ 2" రీసెంట్గానే విడుదలైంది. గొప్ప రివ్యూలు ఐతే రాలేదు కానీ, సినిమా థియేటర్లలో చాలా మంచి రన్ జరుపుకుంటుంది. క్రిస్మస్, న్యూ ఇయర్ .. టైం లో ధియేటర్లకొచ్చిన ఈ సినిమాకు వీక్ డేస్ లో కన్నా వీకెండ్స్ లో అమేజింగ్ కలెక్షన్లు వస్తున్నాయి.
ఇరు తెలుగు రాష్ట్రాలలో 75కోట్ల బిగ్ మార్క్ ను అందుకున్న అవతార్ 2 ప్రపంచవ్యాప్తంగా 1.1 బిలియన్ డాలర్లను వసూలు చేసింది. మరి, లాంగ్ రన్ లో ఈ సినిమా కలెక్షన్లు ఎక్కడికి వెళ్లి ఆగుతాయో చూడాలి. ముఖ్యంగా అవతార్ కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేస్తుందో లేదో అని సినీప్రేమికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa