ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్యతో బన్నీ క్యూట్ సెల్ఫీ ...వైరల్ పిక్..!!

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 31, 2022, 10:07 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుండి పుష్ప 2 సినిమా విడుదల కోసం పాన్ ఇండియా అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పుష్ప తో పాన్ ఇండియా వైడ్ ప్రభంజన విజయం సాధించిన బన్నీ ప్రేక్షకాభిమానులను మరింత ఉల్లాసోత్సాహాలలో నింపేందుకు నెక్స్ట్ ప్రాజెక్టులను వెనక్కి నెట్టి మరీ పుష్ప 2 ను సెట్స్ పైకి తీసుకెళ్లారు.


ఇటీవలే పుష్ప 2 సెట్స్ పైకి వెళ్లగా, ప్రస్తుతం పుష్ప 2 చిత్రబృందం న్యూ ఇయర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తుంది. అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి వెకేషన్ కి వెళ్లగా, అక్కడ సరదాగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో బన్నీతో కలిసి దిగిన ఒక క్యూట్ సెల్ఫీని స్నేహారెడ్డి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేసింది. ఈ పిక్ చూస్తుంటే... పెళ్ళై పదేళ్లు దాటుతున్నా... ఈ ఇద్దరి అందం వన్నె తరగని విధంగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa