బాలీవుడ్ లవ్ బర్డ్స్‌గా పేరొందిన కియారా అడ్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర వచ్చే ఏడాది ఫ్రిబ్రవరిలో పెళ్లిపీటలెక్కబోతున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 6వ తేదీన వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. ఫిబ్రవరి 4, 5 తేదీల్లో హల్దీ, సంగీత్ ఇతర కార్యక్రమాలు ముంబయిలో జరుగుతాయని, అలాగే వీరి వివాహం మాత్రం రాజస్థాన్ జైసల్మీర్ ప్యాలెస్‌లో జరగనున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa