హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ వరుస హిట్లతో దూసుకుపోతుంది. తాజాగా నిఖిల్, అనుపమ కలిసి నటించిన 18 పేజెస్ మంచి విజయాన్ని అందుకుంది. అనుపమ నటించిన బటర్ ఫ్లై సినిమా ఓటీటీలో విడుదలై ఆకట్టుకుంటోంది. దీంతో అనుపమ తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేసిందని టాక్ వినిపిస్తుంది. గతంలో అనుపమ రెమ్యూనరేషన్ రూ.60 లక్షలు ఉండేది. దాన్ని ఇప్పుడు రూ.1.20 కోట్లు చేసిందని సమాచారం. రెమ్యూనరేషన్ ను డబుల్ చేసినా సరే, ఆమె అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.