మాస్ రాజా రవితేజ 2022 యేడాదిని 'ధమాకా'తో గ్రాండ్ గా ముగించారు. నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ధమాకాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. భీమ్స్ సంగీతం అందించారు.
డిసెంబర్ లో విడుదలైన ధమాకా బాక్సాఫీస్ వద్ద అన్స్టాపబుల్ గా దూసుకుపోతుంది. ఫస్ట్ వీక్ లో 62 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన ధమాకా పదవ రోజైన నిన్న తొలిరోజు కన్నా డబుల్ కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద మాస్ రాజా మాస్సివ్ రాంపేజ్ ఎలా ఉంటుందో తెలియచేస్తుంది. మొత్తంగా ధమాకా పదిరోజుల్లో 89కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.