క్రేజీ హీరోయిన్ సమంత, క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ కలయికలో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ "శాకుంతలం". ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఏడాదికిపైగా సమయాన్ని తీసుకున్న శాకుంతలం ఆగస్టులో విడుదల అవ్వాల్సివుంది. ఐతే, 3డి విజువల్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల నిమిత్తం విడుదల తేదీని మేకర్స్ వాయిదా వేసిన విషయం తెలిసిందే.
తాజాగా శాకుంతలం మేకర్స్ నుండి అఫీషియల్ రిలీజ్ డేట్ ఎనౌన్స్మెంట్ జరిగింది. ఈ మేరకు ఫిబ్రవరి 17వ తేదీన 3డి లో శాకుంతలం విడుదల కాబోతుంది.
గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్త బ్యానర్లపై నీలిమ గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. దేవ్ మోహన్, వరలక్ష్మి శరత్ కుమార్, మోహన్ బాబు, అల్లు అర్హ కీరోల్స్ లో నటిస్తున్నారు.