అవతార్ 2 సినిమాకి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో భారీ స్పందన వస్తోంది. జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్, అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. దాదాపు 400 మిలియన్ డాలర్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. 16 రోజుల్లోనే ఇండియా మొత్తం మీద రూ.310.40 కోట్లు నెట్, రూ.360.88 కోట్లు గ్రాస్ వచ్చింది. దీంతో ఈ సినిమా బాలీవుడ్ చిత్రాల రికార్డులను కూడా బ్రేక్ చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ.10,294.10 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించింది.