టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను అందుకొని ఆస్కార్ రేసులో సైతం నిలిచింది. ఈ చిత్రం లోని నాటు నాటు పాట ఆస్కార్ ఉత్తమ సాంగ్ కేటగిరీలో షార్ట్ లిస్ట్ అయింది. తాజాగా లాస్ ఏంజిల్స్ లోని ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్ లో జనవరి 9న ఆర్ఆర్ఆర్ ను ప్రదర్శించనున్నారు. ఈ చిత్రం స్పెషల్ స్క్రీనింగ్ లో రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి పాల్గొననున్నట్లు సమాచారం.