మాస్ రాజా రవితేజ, శ్రీలీల జంటగా నటించిన "ధమాకా" బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కలెక్షన్లను నమోదు చేస్తుంది. ఇరు తెలుగు రాష్ట్రాలలో హౌస్ ఫుల్ ధియేటర్ రన్ తో, ప్రపంచవ్యాప్తంగా పదిరోజుల్లో 89 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టిన ధమాకా పదవరోజైన ఆదివారాన్ని అంటే న్యూ ఇయర్ ని తొలిరోజు కన్నా డబుల్ కలెక్షన్లతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.
తాజాగా మేకర్స్ నుండి కొంతసేపటి క్రితమే ధమాకా మూవీ మేకింగ్ వీడియో విడుదల అయ్యింది. ధమాకా మూవీ షూటింగ్ ఎంత ఫన్ అండ్ ఎంగేజింగ్ గా జరిగిందో ఈ వీడియో చూసి మనం తెలుసుకోవచ్చు.
నక్కిన త్రినాథరావు ఈ సినిమాకు దర్శకుడిగా పనిచేయగా, భీమ్స్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది.