మాస్ రాజా రవితేజ నటించిన న్యూ మూవీ "ధమాకా" రోజురోజుకూ కలెక్షన్లను పెంచుకుంటూ, వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. నిన్ననే ఆంధ్రా, తెలంగాణాలలో అత్యధిక షేర్ సాధించిన నాల్గవ సినిమాగా రికార్డు సృష్టించిన ధమాకా, తాజాగా ఈ రోజు రవితేజ కెరీర్ లో హైయెస్ట్ ఓవర్ సీస్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. అంతేకాక వరల్డ్ వైడ్ గా 94కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి, సెంచరీ క్లబ్ కి అతి చేరువలో వచ్చి ఆగింది.
నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది.