హాలీవుడ్ నటుడు జెరెమీ రెన్నెర్ ఆదివారం ఘోర ప్రమాదానికి గురయ్యారు. తన ఇంటి ముందన్న మంచును వాహనంతో తొలగిస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. అమెరికాలోని రెనో కు చెందిన జెరెమీ రెన్నర్ ఇల్లు మౌంట్ రోజ్ స్కీ తాహో ప్రక్కనే ఉంది. ఆ ప్రాంతంలో ఆదివారం భారీగా మంచు కురిసింది. దాదాపు 35 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జెరెమీ రెన్నర్ తన ఇంటి బయట గడ్డకట్టిన మంచును తొలగించడానికి బయటకు వెళ్లగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని హెలికాప్టర్ లో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. అవెంజర్స్ సిరీస్ తో జెరెమీ రెన్నెర్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు.