తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన 'తునివు' సినిమా తెలుగులో 'తెగింపు' టైటిల్ తో విడుదల కానుంది. హెచ్.వినోద్ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మించాడు. మంజు వారియర్, సముద్రఖని, మమతీ చారి, సిబి భువన చంద్రన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను జనవరి 12న తెలుగు రాష్ట్రాల్లో రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఐవీవై ప్రొడక్షన్స్ సంస్థలు విడుదల చేస్తున్నాయి.