టాలీవుడ్ యువనటుడు కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న సినిమా "వినరో భాగ్యము విష్ణుకథ". ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బురు డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా, చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. కాశ్మీర పరదేశీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ 'వాసవ సుహాస' సాంగ్ కి ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది.
తాజాగా VBVK టీజర్ ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ మేరకు VBVK టీజర్ ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయాలను ఈ రోజు సాయంత్రం 05:02 నిమిషాలకు స్పెషల్ పోస్టర్ తో విడుదల చేసేందుకు మేకర్స్ ముహూర్తం నిర్ణయించారు.