హీరోయిన్ అంజలి నటించిన వెబ్ సిరీస్ "ఝాన్సీ". తెలుగు హాట్ స్టార్ స్పెషల్స్ లో భాగంగా రూపుదిద్దుకున్న ఈ వెబ్ సిరీస్ యొక్క ఫస్ట్ సీజన్ రీసెంట్గానే స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చి, ఆడియన్స్ నుండి అమేజింగ్ రెస్పాన్స్ అందుకుంది. గతం ఏంటో, అసలు తను ఎవరో తనకే తెలియని అంజలి తన పాస్ట్ వల్ల ప్రెజెంట్ తన ఫ్యామిలీ కి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని చేసే పోరాటమే ఝాన్సీ.
తాజాగా ఝాన్సీ సీజన్ 2 ట్రైలర్ విడుదలైంది. ఈసారి డబుల్ యాక్షన్ అండ్ అడ్వెంచరస్ తో మనసుల్ని పిండేసే ఎమోషన్స్ తో ఝాన్సీ అండ్ టీం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తుంది.
తిరు ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చెయ్యగా, ట్రైబల్ హౌస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ చాందిని చౌదరి, ఆదర్శ్ బాలకృష్ణన్, ముమైత్ ఖాన్, రాజ్ అర్జున్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. పోతే, ఈనెల 19 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి రానుంది.