మాస్ మహారాజా రవితేజ హీరోయిన్ మాళవికా శర్మ చీరకట్టులో గ్లామర్ మెరుపులతో మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ కుర్ర గుండెల్ని కొల్లగొట్టేలా ఉన్నాయి. యంగ్ హీరోయిన్ మాళవికా శర్మ తెలుగు సినిమాలపైనే ఆశలు పెట్టుకుంది. 2018లో మాస్ మహారాజా రవితేజ సరసన ‘నేల టికెట్టు’లో నటించి తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది.
ఆ తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని సరసన ‘రెడ్’చిత్రంలో మెరిసి ప్రేక్షకులను అలరించింది. కానీ ఈ రెండు చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ లో పెద్దగా గుర్తింపు దక్కించుకోలేకపోయింది. తన స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకోలేకపోయింది.ఇక ప్రస్తుతం తమిళం, హిందీ సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. చివరిగా మాళవికా శర్మ 2022 చివర్లో తమిళంలో రూపొందిన ‘కాఫీ విత్ కాదల్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంతోనే కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇదిలా ఉంటే అటు సినిమాలతో అలరిస్తూనే.. ఇటు నెట్టింటా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ నెటిజన్లకు మరింతగా దగ్గరవుతోంది. మరోవైపు అందాల విందూ చేస్తోంది. వరుస ఫొటోషూట్లతో నెట్టింట రచ్చరంభోలా చేస్తోంది.తాజాగా మాళవికా శర్మ చీరకట్టులో దర్శనమిచ్చింది. ఎర్రటి చీరలో ఓంపుసొంపుల్ని ప్రదర్శించింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో టాప్ గ్లామర్ షోతో పిచ్చెక్కించింది. మరోవైపు కసి చూపులు, కొంటె పోజులతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. లేటెస్ట్ పిక్స్ ను నెటిజన్లు లైక్స్ కామెంట్లతో తెగ వైరల్ చేస్తున్నారు.
Gorgeous Queen @ImMalvikaSharma#Malvikasharma #MalavikaSharma pic.twitter.com/0dc970vHL9
— Malavika Trends (@MalavikaTrends) January 3, 2023