బింబిసార బ్లాక్ బస్టర్ హిట్ తదుపరి నందమూరి కళ్యాణ్ రామ్ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "అమిగోస్". కళ్యాణ్ రామ్ కెరీర్ లో 19వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి రాజేంద్ర రెడ్డి డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఘిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. అషికా రంగనాధ్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు విభిన్నమైన రోల్స్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి, ఆల్రెడీ ఫస్ట్ క్యారెక్టర్ 'సిద్దార్థ్'ను ఎంటర్ప్రెన్యూర్ గా పరిచయం చేసిన మేకర్స్ తాజాగా రెండో క్యారెక్టర్ కి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ ను విడుదల చేసారు. అమిగోస్ ప్రపంచంలో కళ్యాణ్ రామ్ పోషిస్తున్న ఈ రెండో క్యారెక్టర్ 'మంజునాథ్' పేరుతో ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కనిపించబోతున్నారు. మరి, అతి త్వరలోనే అమిగోస్ టీజర్ విడుదల కాబోతుందని మేకర్స్ ఎనౌన్స్ చేసారు.
పోతే, వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.