సాయిరోనక్, అవికా గోర్ జంటగా నటిస్తున్న సినిమా "పాప్ కార్న్". కొత్త దర్శకుడు మురళీ నాగ శ్రీనివాస్ గంధం డైరెక్షన్లో మెలోడ్రామా జానర్ లో రూపొందుతున్న ఈ సినిమాను, నెపోలియన్, పొలిమేర సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆచార్య క్రియేషన్స్ అధినేత ఎం. భోగేంద్ర గుప్తా నిర్మిస్తున్నారు. హీరోయిన్ అవికా గోర్ స్థాపించిన అవికా స్క్రీన్ క్రియేషన్స్, ఎం ఎస్ చలపతి రాజు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 10వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా యొక్క ట్రైలర్ జనవరి నాల్గవ తేదీన అంటే రేపు విడుదల కావడానికి రెడీ అవుతుంది. RK సినీ ప్లెక్స్ స్క్రీన్ 3 లో రేపు ఉదయం 10:45 నిమిషాలకు జరగబోయే థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కింగ్ నాగార్జున గారు చీఫ్ గెస్ట్ గా పాల్గొని పాప్ కార్న్ ట్రైలర్ ను విడుదల చెయ్యనున్నారు.