హెచ్ వినోద్ డైరెక్షన్లో , దిగ్గజ నిర్మాత బోనీ కపూర్ నిర్మాణసారధ్యంలో రూపొందుతున్న చిత్రం "తునివు''. ఈ సినిమాలో తాలా అజిత్ ప్రధానపాత్రలో నటిస్తుండగా, మంజు వారియర్, సముద్రఖని కీరోల్స్ లో నటిస్తున్నారు. రేసెంట్గానే తునివు ట్రైలర్ విడుదలై, అభిమానులలో సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచింది. అంతేకాక "తెగింపు" టైటిల్ తో తెలుగులో విడుదల కాబోతున్న ఈ సినిమా యొక్క తెలుగు ట్రైలర్ కూడా నిన్ననే విడుదలై, తెలుగు ఆడియన్స్ లో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసింది.
తాజా అధికారిక సమాచారం మేరకు, పొంగల్ 2023 కానుకగా తెలుగు, తమిళ భాషలలో విడుదల కావడానికి రెడీ అవుతున్న తునివు సెన్సార్ పూర్తి చేసుకుందని తెలుస్తుంది. సెన్సార్ బృందం నుండి తునివు కి యూ/ ఏ సెర్టిఫికేట్ వచ్చిందని స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసి మరీ మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.