టాలీవుడ్ లోకి ‘కాంచనమాల కేబుల్ టీవీ’ చిత్రంతో రాయ్ లక్ష్మి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 2005లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 15 ఏండ్ల కిందనే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింట ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తోంది.కేరీర్ ప్రారంభం నుంచి రాయ్ లక్ష్మీ విభిన్న పాత్రల్లో తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తూ తనదైన ముద్ర వేసుకుంది. చివరిగా తెలుగులో ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ హార్రర్ ఫిల్మ్ తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మరోవైపు సోషల్ మీడియాలోనూ అందాల రచ్చ చేస్తోంది. నెట్టింట తన అభిమానులు, నెటిజన్లకు టచ్ లో ఉంటూ క్రేజీ పోస్టులతో ఫిదా చేస్తోంది. ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్ ఫిట్లతో ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం వేకేషన్స్ లో ఉన్న రాయ్ లక్ష్మి అందాలను ఆరబోస్తోంది. బీచ్ లో బికినీ అందాలతో హీటెక్కిస్తోంది. ఆ ఫొటోలను నెట్టింట వదులుతూ నెటిజన్ల మతులు పోగొడుతోంది. బీచ్ డ్రెస్ లో టాప్ టు బాటమ్ పరువాలను ప్రదర్శిస్తూ రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.