కొత్త దర్శకుడు మురళీ నాగ శ్రీనివాస్ గంధం డైరెక్షన్లో సాయి రోనక్, అవికా గోర్ జంటగా నటిస్తున్న సినిమా "పాప్ కార్న్". మెలోడ్రామా జానర్ లో రూపొందుతున్న ఈ సినిమాను ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ సంయుక్త బ్యానర్ లపై ఎం. భోగేంద్ర గుప్తా నిర్మిస్తున్నారు.
కింగ్ నాగార్జున కొంతసేపటి క్రితమే ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చెయ్యడం జరిగింది. ఒక షాపింగ్ కాంప్లెక్స్ లో బాంబు బ్లాస్ట్ జరిగినప్పుడు అందులోని బేస్మెంట్ లిఫ్ట్ లో ఇద్దరు పరిచయం లేని అమ్మాయి, అబ్బాయి ఉండిపోతారు. ఒకరంటే ఒకరికి పడని ఇద్దరూ ఆ క్లిష్ట పరిస్థితి నుండి ఎలా బయటపడ్డారు, ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఏర్పడిన ఎమోషనల్ బాండ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా పై తాజాగా విడుదలైన ట్రైలర్ తో పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి.
శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 10వ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa