బాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా చేసిన 'కథానాయకుడు' సినిమా జనవరి 9 న భారీ అంచనాల మధ్య విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రావడంతో థియేటర్స్ దగ్గర ఒక రేంజ్ లో సందడి వాతావరణం నెలకొంది. సినిమా చుసిన వారందరు బాలకృష్ణ నటన అదుర్స్ అంటున్నారు. సినీ ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖులు అందరూ ఈ సినిమా ఫై వారి వారి అభిప్రాయాలను వెల్లడించారు.
అలాగే సూర్య దిన పత్రిక చైర్మన్ నూకారపు సూర్యప్రకాష్ రావు గారు కూడా సినిమా చూసి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.అది ఏంటంటే ' ఎన్టీఆర్ కథానాయకుడు ఒక అద్భుత చిత్రం. బాలకృష్ణ గారిని చుస్తే ఎన్టీఆర్ ను చూస్తున్నట్లుంది. డైరెక్టర్ క్రిష్ గారికి అండ్ టీం అందరికి కంగ్రాట్స్ అని చెప్పారు'.