వరస పరాజయాల నుండి రీసెంట్గా విడుదలైన "ఒకే ఒక జీవితం" తో బౌన్స్ బ్యాక్ అయ్యారు టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్. కెరీర్ తొలినాళ్ళ నుండి కమర్షియల్ సినిమాల కన్నా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకే శర్వా పెద్దపీట వేసారు. ఈ నేపథ్యంలోనే శర్వా నుండి ప్రస్థానం, రన్ రాజా రన్, అమ్మ చెప్పింది, ఎక్స్ప్రెస్ రాజా, మహాసముద్రం, గమ్యం, శతమానం భవతి, ఒకేఒక జీవితం వంటి విభిన్న స్క్రిప్ట్స్ వచ్చాయి. ఏ స్టార్ హీరో అభిమానులైనా ఇష్టపడే హీరో శర్వానంద్. శర్వాకు లేడీ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.
తాజా బజ్ ప్రకారం, శర్వా అతి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్టు తెలుస్తుంది. అదికూడా ... అమెరికా NRI అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ముందు ఎంగేజ్మెంట్, ఆపై వివాహం చేసేందుకు ఇరు కుటుంబాల పెద్దలు ముహుర్తాలు నిర్ణయించే పనిలో ఉన్నారట. మరి, అతి త్వరలోనే శర్వానంద్ నుండి గుడ్ న్యూస్ రాబోతుందన్న మాట.