దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి గారి RRR సినిమా విడుదలైనప్పటి నుండి ఏదో ఒక రికార్డు క్రియేట్ చేస్తూ లేకుంటే కొత్త రికార్డును నమోదు చేస్తూ వార్తలో నిలుస్తూనే ఉంది. తాజాగా RRR మరోసారి హాట్ టాపిక్ గా నిలిచింది. ప్రెస్టీజియస్ చైనీస్ ఐమ్యాక్స్ థియేటర్లో ఈ నెల 9న RRR స్పెషల్ స్క్రీనింగ్ ఉంది. ఈ నేపథ్యంలో థియేటర్ యాజమాన్యం RRR స్పెషల్ స్క్రీనింగ్ టికెట్లను అమ్మకానికి పెట్టగా కేవలం 98 సెకన్లలోనే మొత్తం టికెట్లన్నీ అమ్ముడయ్యాయట. ఇంతకుముందు ఏ ఇండియన్ సినిమాకు కూడా ఇలాంటి అరుదైన సంఘఠన ఎదురవలేదంట.
రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. డీవీవీ దానయ్య నిర్మించారు.