బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణె ఈ రోజు 37వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ ఆమెకు సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ ను తెలియచేస్తున్నారు. ఇంకా దీపికా నటిస్తున్న అప్ కమింగ్ సినిమాల నుండి ఎక్జయిటింగ్ బర్త్ డే విషెస్ పోస్టులు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో 'ప్రాజెక్ట్ కే' నుండి దీపికకు బర్త్ డే విషెస్ ను తెలియచేస్తూ చిత్రబృందం ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేసింది. ఏ హోప్ ఇన్ ది డార్క్ అని దీపికను వర్ణిస్తూ విడుదల చేసిన ఈ పోస్టర్ లో ఉదయిస్తున్న సూర్యుడి నుండి ఆవిర్భవిస్తున్న తొలికిరణంలా దీపికా కనిపిస్తుంది. ఐతే, ఆమె ఫేస్ ను మేకర్స్ రివీల్ చెయ్యలేదు.
నాగ్ అశ్విన్ డైరెక్షన్లో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై ch. అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.