డిసెంబర్ 2, 2021లో విడుదలైన "అఖండ" ఇరు తెలుగు రాష్ట్రాలలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. హిట్ కాంబో బోయపాటి శ్రీను - బాలకృష్ణ కలయికలో వచ్చిన ఈ యాక్షన్ ఎమోషన్ ఎంటర్టైనర్ తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించింది.
పోతే, ఈ నెల 20వ తేదీన అఖండ సినిమా హిందీలో విడుదల కావడానికి రెడీ అయింది. పెన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఉత్తరాదిన భారీగా రిలీజ్ చేయబోతుంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితమే అఖండ హిందీ వెర్షన్ ట్రైలర్ విడుదలయ్యింది. అదే పవర్, అదే ఇంటెన్స్, అవే యాక్షన్ ఎలిమెంట్స్, అదే ఎమోషన్ తో కట్ చేసిన ఈ కొత్త హిందీ ట్రైలర్ చూస్తుంటే... గూజ్ బంప్స్ వస్తున్నాయి.
మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా, బాలయ్య ద్విపాత్రాభినయం చేసారు.