యంగ్ హీరో సంతోష్ శోభన్, కోలీవుడ్ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ జంటగా నటిస్తున్న చిత్రం "కళ్యాణం కమనీయం". చడీ చప్పుడు లేకుండా సడెన్ గా సంక్రాంతి బరిలోకి దూసుకొచ్చిన ఈ సినిమాపై ఆడియన్స్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.
విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈ మేరకు హీరో హీరోయిన్లు కలిసి కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తుండగా, తాజాగా మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈరోజు సాయంత్రం 05:04 నిమిషాలకు టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి కళ్యాణం కమనీయం ట్రైలర్ ను డిజిటల్ లాంచ్ చెయ్యనున్నారని కొంతసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసారు.
ఈ సినిమాకు అనిల్ కుమార్ ఆళ్ళ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తుంది. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న కళ్యాణం కమనీయం చిత్రం థియేటర్లలో విడుదల కాబోతుంది.