మాస్ రాజా రవితేజ, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన చిత్రం "ధమాకా". నక్కిన త్రినాధరావు ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. రీసెంట్గా థియేటర్లకొచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మ్యూజిక్, యాక్షన్, కామెడీ... అన్ని విభాగాల్లోనూ ఈ సినిమా ఘనవిజయం సాధించింది.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి రవితేజ ఇంట్రో సాంగ్ 'మాస్ రాజా' వీడియో సాంగ్ టీజర్ ను మేకర్స్ విడుదల చెయ్యడం జరిగింది. మరి, అతి త్వరలోనే మాస్ రాజా వీడియో సాంగ్ కూడా విడుదల కాబోతుందని తెలుస్తుంది. భీమ్స్ స్వరపరిచిన ఈ పెప్పీ మాస్ డాన్స్ నెంబర్ కు రవితేజ మరియు డాన్సర్ల గ్రేస్ మూవ్మెంట్స్, భీమ్స్ ఎనర్జిటిక్ వాయిస్... తోడవ్వడంతో ఈ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.