బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో మూడు సూపర్ హిట్ సినిమాలలో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది గ్లామరస్ బ్యూటీ దీపికా పదుకొణె. వీరిద్దరి కలయికలో ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్ సినిమాలు విడుదలై, ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ అందుకున్నాయి.
షారుఖ్, దీపికా జంటగా నటిస్తున్న నాలుగవ సినిమా "పఠాన్''. సిద్దార్ధ్ ఆనంద్ డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో జాన్ అబ్రహం కీరోల్ లో నటిస్తున్నారు.
ఈరోజు దీపికా పుట్టినరోజు సందర్భంగా పఠాన్ నుండి న్యూ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ లో దీపికా యాక్షన్ స్టిల్ లో కనిపిస్తున్నప్పటికీ ఆమె ముఖం ఎమోషనల్ గా ఉంది. పోతే, పఠాన్ మూవీ ఈ నెల 25న హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కాబోతుంది.