బింబిసార బ్లాక్ బస్టర్ తదుపరి నందమూరి కళ్యాణ్ రామ్ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "అమిగోస్". రాజేంద్ర రెడ్డి డైరెక్షన్లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఘిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. కన్నడభామ అషికా రంగనాధ్ హీరోయిన్ గా నటిస్తుంది.
తాజా అధికారిక సమాచారం ప్రకారం, జనవరి 8వ తేదీ ఉదయం 11:07 గంటలకు అమిగోస్ టీజర్ విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ తో మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. ఈ పోస్టర్ కు ఒక స్పెషాలిటీ ఉంది. ఇప్పటివరకు కళ్యాణ్ నటిస్తున్న రెండు పాత్రల పరిచయ పోస్టర్లు విడుదల కాగా, ఇందులో మూడవ పాత్రను 'అన్ నోన్' గా మేకర్స్ ప్రేక్షకులకు పరిచయం చేసారు. దీంతో ఒకేసారి అమిగోస్ టీం నుండి డబుల్ ధమాకా వచ్చినట్లయ్యింది.