క్రేజీ హీరోయిన్ సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్ జంటగా, క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్షన్లో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ "శాకుంతలం". మోహన్ బాబు, వరలక్ష్మి శరత్ కుమార్, అల్లు అర్హ, అనన్యా నాగళ్ళ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో ఫిబ్రవరి 17వ తేదీన విడుదల కాబోతుంది.
శాకుంతలం లేటెస్ట్ అప్డేట్ మేకర్స్ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు హుంగేరి లోని బుడాపెస్ట్ సింఫనీ ఆర్కెస్ట్రాతో శాకుంతలం rr సెషన్స్ జరుగుతున్నాయని తెలుపుతూ అందుకు సంబంధించిన చిన్న వీడియోను మేకర్స్ విడుదల చేసారు.
మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నీలిమ గుణ నిర్మిస్తున్నారు. దిల్ రాజు సమర్పిస్తున్నారు.