కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన ‘పేట’ చిత్రం నిన్న విడుదలైంది. ఈ చిత్రం హిట్ టాక్ సంపాదించుకోవడంతో రజనీ అభిమానులు సంబరపడుతున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ స్పందించారు. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చిందని తెలిసిందని, తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
ఈ సినిమాలో తాను బాగా నటించానని ప్రశంసలు వస్తున్నాయని, ఇందులో తనదేమీ లేదని, ఈ ప్రశంసలన్నీ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కు దక్కుతాయని, ఈ చిత్ర విజయానికి కారణం ఆయనేనని ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రజలకు, తన అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, విహారయాత్ర నిమిత్తం గత ఏడాది డిసెంబరు 22న ఆయన అమెరికా వెళ్లారు. తిరిగి నిన్న చెన్నై చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో తనను పలకరించిన విలేకరులతో రజనీ పైవిధంగా స్పందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa