మెగాస్టార్ చిరంజీవి గారి "వాల్తేరు వీరయ్య" సినిమా కోసం మెగాఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్ పూనకాలకు సంబంధించిన చిన్న శాంపిల్ ను ట్రైలర్ రూపంలో విడుదల చేసేందుకు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ మేరకు మేకర్స్ రేపు వాల్తేరు వీరయ్య ట్రైలర్ విడుదల కాబోతుందని, ఎల్లుండి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందని ఒకే పోస్టర్ తో డబుల్ ధమాకా అప్డేట్స్ ను ఫ్యాన్స్ కి చేరవేశారు.
బాబీ కొల్లి డైరెక్షన్లో మెగాస్టార్, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ స్పెషల్ ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన విడుదల కావడానికి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa