మీర్జాపూర్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ సీనియర్ నటుడు మనోజ్ బాజ్‌పేయి ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. ఈ విషయాన్ని మనోజ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తన ట్విట్టర్‌లో పోస్టు చేసే వాటికి ఎవరూ స్పందించొద్దని, ఖాతా పునరుద్ధరణ సమస్య పరిష్కారం అయ్యాక అప్‌డేట్ చేస్తా అంటూ పోస్టు చేశారు. కాగా, ఇవాళ 20 కోట్ల మంది ట్విట్టర్ ఖాతాలు హ్యాక్‌కు గురైన విషయం తెలిసిందే.