ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుండి ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి రాబోతున్న విషయం తెలిసిందే. ఒక్కరోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ ను ఒంటిచేత్తో చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు మేకర్స్. అయితే లేటెస్ట్ అప్‌డేట్‌తో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను అనుకున్న ప్రకారం విశాఖపట్నంలో నిర్వహించాలని ఆర్కే బీచ్ ప్లాన్‌లో ఎలాంటి మార్పు లేదని ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. ఈ సినిమాలో గంగానది కొడుకుగా కనిపించనున్న మెగాస్టార్ తన సినిమా ఈవెంట్ గంగానది ఒడ్డున జరుగుతోందనే చెప్పాలి.