ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుండి ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి రాబోతున్న విషయం తెలిసిందే. ఒక్కరోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ ను ఒంటిచేత్తో చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో నిన్ననే వీరసింహారెడ్డి ట్రైలర్ రిలీజ్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ ఒంగోల్లో అంగరంగ వైభవంగా జరపగా, ఈ రోజు, రేపు వాల్తేరు వీరయ్యకు సంబంధించిన ట్రైలర్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లను నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు.
పోతే, ఈ రోజు వాల్తేరు వీరయ్య ట్రైలర్ విడుదల కాబోతుందని రెండ్రోజుల క్రితమే ఎనౌన్స్ చేసిన మేకర్స్ తాజాగా ఈ రోజు ట్రైలర్ రిలీజ్ టైం ను మెన్షన్ చేస్తూ సరికొత్త పోస్టర్ ను విడుదల చెయ్యబోతున్నామని ప్రకటించారు.