చైల్డ్ ఆర్టిస్ట్ నుండి అడల్ట్ యాక్ట్రెస్ గా ఆపై లీడ్ హీరోయిన్ గా అంచలంచెలుగా ఎదుగుతుంది అనిఖా సురేంద్రన్. పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన అనిఖా లీడ్ హీరోయిన్ గా డిబట్ ఎంట్రీ ఇస్తున్న మూవీ "బుట్టబొమ్మ". ఈ సినిమాను శౌరీ చంద్రశేఖర్ టి రమేష్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో అర్జున్ దాస్ విలన్గా నటిస్తుండగా, సూర్య వసిష్ఠ హీరోగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.
టీజర్ తో ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ వీడియో విడుదల కావడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. ఈ మేరకు బుట్టబొమ్మ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ 'పేరులేని ఊరిలోకి' సాంగ్ ను జనవరి 9వ తేదీన విడుదల చెయ్యబోతున్నట్టు తెలుపుతూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు.
పోతే, ఈ మూవీ ఈనెల 26న విడుదల కావడానికి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa