ట్యాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి చిత్రం "హరిహర వీరమల్లు". పవన్ నుండి రాబోతున్న తొలి పానిండియా ప్రాజెక్ట్ ఇది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకాభిమానుల్లో భీభత్సమైన అంచనాలు ఉన్నాయి.
తాజా సమాచారం ప్రకారం, బాలీవుడ్ గ్లామరస్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి ఈ నెలాఖరులో HHVM సెట్స్ లో పాల్గొనబోతుందని తెలుస్తుంది. హరిహర వీరమల్లు లో నోరాఫతేహి నటించబోతుందన్న వార్త గతంలోనే వినిపించినప్పటికీ ఇన్నాళ్లకు ఆమెకు ఈ మూవీ సెట్స్ లో పాల్గొనే అవకాశం వచ్చింది. పోతే, ఈ సినిమాతో నోరా నటిగా టాలీవుడ్ సినీ రంగ ప్రవేశం చేస్తుంది. అంతకుముందు పలు క్రేజీ తెలుగు సినిమాలలో నోరా ఐటెం సాంగ్స్ లో చిందేసిన విషయం తెలిసిందే.
నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa