ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాజా వార్త : 'భారతీయుడు 2' లో శింబు

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 12, 2019, 04:10 PM

శంకర్ దర్శకత్వంలో 'భారతీయుడు 2' రూపొందుతోంది. ఈ సినిమాకి సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో కమల్ సరసన కథానాయికగా కాజల్ కనిపించనుంది. ఈ సినిమాలో శింబు ఒక కీలకమైన పాత్రను పోషించనున్నట్టు కొన్ని రోజుల క్రితం ఒక వార్త వచ్చింది. దాంతో ఆయన ఏ పాత్రలో కనిపించనున్నారనేది ఆసక్తికరంగా మారింది.

ఈ సినిమాలో శింబు .. కమల్ మనవడి పాత్రలో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. 'భారతీయుడు'లో కమల్ 'సేనాపతి' అనే వృద్ధుడిగా .. ఆయన కొడుకు 'చంద్రబోస్'గా రెండు పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాలో 'సేనాపతి' మనవడిగా .. 'చంద్రబోస్' కొడుకుగా శింబు కనిపిస్తాడని చెబుతున్నారు. చాలా డిఫరెంట్ గా శింబు పాత్రను శంకర్ మలిచాడని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కోసం 8 దేశాల్లోని లొకేషన్స్ ను ఎంపిక చేశారు. ఆయా ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగును జరుపుకుంటుందన్న మాట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa