మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖలో ప్రారంభమైంది. బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్ జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ వేడుకను విశాఖపట్నంలో చిత్రబృందం నిర్వహించింది.