కేజీఫ్ తో సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో తీస్తున్న ఔటండౌట్ యాక్షన్ ఎంటర్టైనర్ "సలార్". హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదుర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాపై వినిపిస్తున్న తాజా అప్డేట్ ప్రకారం, ప్రభాస్ కెరీర్ లో ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాలలో సలార్ లుక్ సరికొత్తగా ఉండబోతుందంట. కేజీఎఫ్ లో రాఖీభాయ్ ను ఎలా ఐతే, మాస్సీ అండ్ రా & రగ్డ్ లుక్ లో ప్రశాంత్ చూపించారో ఇప్పుడు సలార్ లో కూడా డార్లింగ్ ను అంతే మాస్ లుక్ లో చూపించబోతున్నారట. అంతేకాక మరో విశేషమేంటంటే, ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ కు రెండు వేరియేషన్స్ ఉంటాయట. సో, ఈ రెండు క్యారెక్టర్ కి డిఫరెంట్ లుక్స్ ఇవ్వడానికి చిత్రబృందం తెగ కష్టపడ్డారట. దీంతో ఒకే సినిమాలో డార్లింగ్ ప్రభాస్ డబుల్ ధమాకా యాక్షన్ చూసే అవకాశం రాబోతుండడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa