మ్యాచో హీరో గోపిచంద్ గత ఏడాది ‘పంతం’ తో ప్రేక్షకులముందుకు వచ్చాడు. ఇటీవల వరుస పరాజయాలను చవి చూసిన గోపీచంద్ కి ఈ చిత్రం కూడా అనుకున్న విజయాన్ని అందిచలేకపోయింది. ఇక ఈ చిత్రం తరువాత కొంత గ్యాప్ తీసుకోని తిరు దర్శకత్వంలో నటించడానికి సిద్దమవుతున్నాడు ఈ హీరో. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే లాంచ్ అయ్యింది. ఈచిత్రంలో గోపిచంద్ గడ్డం తో కొత్త లుక్ లో కనిపించనున్నాడు.
ఇక ఈ చిత్రం తరువాత ఆయన సంపంత్ నంది దర్శకత్వంలో నటించనున్నాడు . వీరిద్దరి కాంబినేషన్ లోఇంతకుముందు గౌతమ్ నంద చిత్రం తెరకెక్కింది. సత్య సాయి ఆర్ట్స్ పతాకం ఫై కేకే రాధామోహన్ ఈ కొత్త చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘పంతం’ కూడా ఇదే ప్రొడక్షన్స్ లో చేశాడు గోపిచంద్. మరి ఈ రెండు చిత్రాలు గోపీకి విజయాలను అందిస్తాయో లేదో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa