ఈ సంక్రాంతి పండుగ కానుకగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'వీరసింహారెడ్డి' ఈ నెల 12న రిలీజ్ కానుంది.మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా 'వాల్తేరు వీరయ్య' 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు సినిమాల టిక్కెట్ ధరలను పెంచేందుకు అనుమతినిచ్చింది. టిక్కెట్ ధరలను గరిష్టంగా రూ.45 వరకు పెంచేందుకు అనుమతి ఇచ్చింది.ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.