ఈ సంక్రాంతి పండుగ కానుకగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'వీరసింహారెడ్డి' ఈ నెల 12న రిలీజ్ కానుంది.మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా 'వాల్తేరు వీరయ్య' 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ రెండు చిత్రాలకు ఆరో ఆట అనుమతించబడింది. సినిమాల విడుదల రోజు ఉదయం 4 గంటల నుంచి షో పెట్టుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.