ఈ రోజు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో గుర్తుండిపోయే రోజు అవుతుంది. మన RRR మూవీలోని నాటు నాటు పాటకు ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు దక్కింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న ఫస్ట్ ఏషియన్ సాంగ్ గా, ఫస్ట్ ఏషియన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎం ఎం కీరవాణి గారు ఆల్ టైం రికార్డును నెలకొల్పారు. నిజంగా ఇది ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడే విషయం. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల నుండి ముఖ్యంగా మన తెలుగు వారి నుండి ఎం ఎం కీరవాణి గారికి హార్దిక శుభాకాంక్షలు అందుతున్నాయి. కీరవాణి గారు గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుంటున్న వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.