నాలుగేళ్ళ షార్ట్ గ్యాప్ తదుపరి కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "పఠాన్". నిన్ననే ఈ మూవీ ట్రైలర్ హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదలైంది. స్టైలిష్ మేకింగ్, షారుఖ్ గూజ్ బంప్స్ యాక్షన్ సీక్వెన్సెస్ తో పఠాన్ ట్రైలర్ సూపర్ పాజిటివ్ రివ్యూలను అందుకుంటుంది.
ఈనేపధ్యంలో పఠాన్ ట్రైలర్ పై రాజమౌళి తన స్పందన తెలుపుతూ ట్వీట్ చెయ్యడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పఠాన్ ట్రైలర్ ఫాబ్యులస్ గా ఉంది... కింగ్ తిరిగొచ్చేశాడు.. పఠాన్ చిత్రబృందానికి ఆల్ ది వెరీ బెస్ట్ .. అంటూ జక్కన్న చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సిద్దార్ధ్ ఆనంద్ డైరెక్షన్లో రూపొందిన పఠాన్ ఈ నెల 25న హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదల కాబోతుంది.