మూడ్రోజుల క్రితం విడుదలైన వాల్తేరు వీరయ్య ట్రైలర్ యూట్యూబులో వేలకొద్దీ వీక్షణలను రాబడుతూ అన్స్టాపబుల్ గా దూసుకుపోతుంది. ఇప్పటివరకు వాల్తేరు వీరయ్య ట్రైలర్ కు యూట్యూబులో 15 మిలియన్ వ్యూస్, 538కే లైక్స్ వచ్చాయి. ఇంతటితో సరిపెట్టుకోక విడుదలైన రోజు నుండి యూట్యూబ్ #1 ట్రెండింగ్ పొజిషన్ ని ఆక్రమించి, బ్రేకుల్లేని బులెట్ బండిలా వాల్తేరు వీరయ్య దూసుకుపోతున్నాడు.
బాబీ కొల్లి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి గారు, మాస్ రాజా రవితేజ గారు కలిసి నటించిన వాల్తేరు వీరయ్యలో శ్రుతిహాసన్, క్యాథెరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.