ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సావిత్రి బయోపిక్ కి మరో అరుదైన గౌరవం

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 13, 2019, 12:36 PM

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మహానటి’ గత ఏడాది విడుదలై బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సాధించింది. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బయోపిక్ చిత్రాల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అంతేకాకుండా గత ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ టాప్ 10 చిత్రాల్లో నాల్గవ స్థానంలో నిలిచింది.

ఇక ఇప్పుడు ఈ చిత్రం మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. పూణే లో జరుగుతున్న పూణే 17వ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లో ఈ చిత్రాన్ని రేపు ప్రదర్శించ నున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ నిర్మించింది.

ఇక ఈ చిత్రం తరువాత చాలా గ్యాప్ తీసుకొని తెలుగులో కొత్త చిత్రానికి ఓకే చెప్పింది కీర్తి సురేష్. నూతన దర్శకుడు నరేంద్రనాథ్ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని మహేష్ కోనేరు నిర్మించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa