యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన కొత్త చిత్రం "కళ్యాణం కమనీయం" సంక్రాంతి బరిలో దిగబోతుందని ఎప్పుడైతే మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారో, ఇక అప్పటి నుండి ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తుంది. ఇక, లిరికల్ సాంగ్స్ తో కొంచెం కొంచెంగా సినిమా ఆడియన్స్ లో అంచనాలను రేకెత్తించగా, ట్రైలర్ రిలీజ్ అయ్యి, సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచింది. ఈ నేపథ్యంలో రేపు విడుదల కాబోయే కళ్యాణం కమనీయం సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కుతాయని తెలుస్తుంది.
అనిల్ కుమార్ ఆళ్ళ డైరెక్షన్లో యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాతో కోలీవుడ్ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ టాలీవుడ్ డిబట్ చేస్తుంది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa